Mahaa Daily Exclusive

  బీసీలందరూ సంఘటితం కావాలి ఓబీసీ ల పోరుబాట పుస్తక సమీక్ష ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ..!

Share

హన్మకొండ మహా;

జన అధికార సమితి, ది వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి రాసిన ఓబీసీ ల పోరుబాట పుస్తక సమీక్ష కార్యక్రమానికి ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా
ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరిని శాలువాతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..
చైతన్యవంతులైన బీసీలందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని
బీసీలందరూ ఏకమైనప్పుడే రాజ్యాధికారం సాధ్యమవుతుందని
బీసీలకు రాజ్యాధికారం వచ్చినప్పుడే సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.
పార్టీలకతీతంగా సంఘాలకతీతంగా బీసీ ఉద్యమం ఎక్కడ జరిగిన అక్కడ వినయ్ భాస్కర్ ఉంటాడని, ఎల్లప్పుడూ బీసీలకు అండగా ఉంటారని తెలిపారు.
బీసీ ఉద్యమాల్లో నేను ఎప్పుడూ ముందుంటానని ఆయన తెలిపారు.
నరహరి రాసిన ఓబీసీ ల పోరుబాట పుస్తకం బీసీలకు ఒక దిక్సూచిగా పనిచేస్తుందని అన్నారు.
వ్యక్తిగతంగా బీసీ ఉద్యమాలలో పాల్గొంటూ హనుమకొండ లోని కాకతీయ యూనివర్సిటీ, ములుగు రోడ్డు ప్రాంతాల్లో పూలే విగ్రహ స్థాపనకు కృషి చేయడం జరిగిందని గుర్తు చేశారు.
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ అందరం కలిసి కట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ నేతలు వన్నాల శ్రీరాములు, కుసుమ సతీష్, డాక్టర్ వన్నాల వెంకటరమణ, డాక్టర్ కాళీ ప్రసాద్, సాంబారి సమ్మారావు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.