Mahaa Daily Exclusive

  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ వద్దు..!

Share

ఇల్లెందు , మహా.
యూరియా రైతులకు సరిపడ సరఫరా చేయాలి
కనీసం ఒక రైతుకు యూరియా 10 బస్తాలు డి ఏ పి 20 20.14.13.14, పోటాష్, అ మున్య, రిజెక్ట్ గుళికలు, పురుగుల మందులు అందించాలిరైతులకు ఎటువంటి షరతులు లేకుండా ఎరువులు మందు అందించాలి సబ్సిడీ పూర్తిస్థాయిలో అమ్ములు చేయాలి
అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉప అధ్యక్షులు బానోత్ ఊక్లా డిమాండ్ చేసారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా గోదారి పరివాహక ప్రాంతం ఉన్నటు వంటి జిల్లాల్లో ఎరువుల కొరత చాలా తీవ్రతంగా ఉన్నాయి. ఈ ప్రాంత గిరిజన హరిజనవాసులు పోడు భూములు నమ్ముకుని సేద్యం చేస్తూ ఉంటారు వర్షాకాలం సీజన్లోనే ఎక్కువగా రైతులకు దుక్కిమందు అవసరం ఉంటుంది ప్రభుత్వం ఎరువుల కొరత లేదని చెప్తూనే రైతులకు హరిగోశ పెడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా యూరియా చాలా రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుందనీ అన్ని మండల కేంద్రాల్లో ముఖ్యంగా ఏజెన్సీ మండలాల్లో కేంద్రాల్లో సహకార సొసైటీలో యూరియా కొరత తో నిద్ర హారాలు మాని సద్ది మూట చేత పట్టి యూరియా కోసం రైతులు నిర్వేక్షణ చేస్తున్నార
న్నారు. మండల కేంద్రాల్లోని సహకార సొసైటీ కి రైతులు బార్లు తీస్తున్నారు నెల రోజుల నుండి రైతులు తమ వ్యవసాయ పనులను మానుకొని యూరియా కోసం తిరుగుతూ యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారనీ,రైతులకు తక్షణమే ఎరువులు అందించాలని దళారులకు అక్రమ మార్గాల్లో చేరకుండా అధికారులు చర్య తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో అఖిలభా
రత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పోలూరి శ్రీనివాసరావు ఐ ఎఫ్ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ రామ్ సింగ్ భూక్య శివ నాయక్ పాయం రామారావు బంగారి లక్ష్మీ బాబురావు వెంకన్న నాగేష్ మల్చూర్ పాల్గొన్నారు.

Latest