ఖమ్మం అర్బన్,మహా.
ఖమ్మం రూరల్ మండల పరిధిలోని మంగళగూడెం గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయుడు, కవి, రచయిత శ్రీ పంజాల ఐలయ్య గారు జాతీయ స్థాయి “భారత్ విభూషణ్” పురస్కారానికి ఎంపికై, ఆదివారం ఘనంగా సత్కరించబడ్డారు.
ఈ అవార్డు ప్రదానోత్సవం కరీంనగర్ ఫిలిం భవన్లో శ్రీ ఆర్యాణి సకల కళా వేదిక, శ్రీ గౌతమేశ్వర సాహితి కళా సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైరాగ్యం ప్రభాకర్ రావు, డాక్టర్ గీతారెడ్డి, ప్రముఖ రచయిత గోపాలరావు, డాక్టర్ దూడ పాక శ్రీధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఐలయ్యకు బంగారు పతకం, ప్రశంసా పత్రంతోపాటు “భారత్ విభూషణ్” పురస్కారాన్ని అందజేశారు. ఐలయ్య సాహిత్య సేవలకు, విద్యా రంగంలో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించిందని నిర్వాహకులు తెలిపారు.
మండల విద్యాశాఖ అధికారి ఎం. శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు బీ. శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఐలయ్య గారిని ప్రత్యేకంగా అభినందించారు.
పాఠశాల విద్యతోపాటు సాహిత్యాన్ని తన జీవన విధిగా చేసుకున్న ఐలయ్యకు ఈ అవార్డు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది.








