Mahaa Daily Exclusive

  ఈ నెల 25న మెగా ఉద్యోగ మేళా సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నేతల పిలుపు ..!

Share

ఆదిలాబాద్, మహా

నిరోద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 25వ తేదీన ఉట్నూర్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ, జీసిసి చైర్మన్ కొట్నాక్ తిరుపతి, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగులకు వివిధ సంస్థల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పాల్గొంటాయని తెలిపారు. ఉట్నూర్ లోని జెసిఎన్ ఫంక్షన్ హల్లో ఉదయం 10గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం పేరు చెప్పి నిరుద్యోగులను మోసం చేసిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50వేల ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ లో నిరుద్యోగులు ఉండకూడదని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని పేర్కొన్నారు. తాజాగా నిర్వహించే జాబ్ మేళాలో అంతర్జాతీయ సంస్థలు కూడా పాల్గొనడం తొలిసారని గుర్తు చేశారు. నిరుద్యోగులు భారీగా తరలి వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై నిరుద్యోగులకు సదుపాయాలు కల్పించాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌,సెడ్మ‌కె ఆనంద రావు, భూప‌ల్లి శ్రీ‌ధ‌ర్ , గుడిప‌ల్లి న‌గేష్,గిమ్మ‌సంతోష్ ,సామ రూపేష్ రెడ్డి, క‌లాల శ్రీ‌నివాస్, మునిగెల విఠ‌ల్, ఎంఏ ష‌కీల్, రామ్ కుమార్,ఫైజుల్లా ఖాన్, రాందాసం నాక్లే, దాస‌రి ఆశ‌న్న‌, శ్రీ‌లేఖ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Latest