Mahaa Daily Exclusive

  సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన కంది శ్రీ‌నివాస రెడ్డి ..!

Share

ఆదిలాబాద్, మహా :

పేద బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల సంక్షేం కోసం కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌ని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. పేద‌ల వైద్య‌ఖ‌ర్చుల నిమిత్తం ముఖ్య మంత్రి స‌హాయ నిధినుండి వ‌చ్చిన చెక్కుల‌ను ఆదివారం తన క్యాంపు కార్యాలయం ప్రజా సేవభన్ లో అందించారు. జైనథ్ మండలం కంఠ గ్రామానికి కు చెందిన గడ్డం అమ్మక్క రూ.60వేలు, బేల మండలం సాంగ్డి కి చెందిన బేదొడ్కర్ అనిత రూ.60వేలు, సాంగ్డి కి చెందిన జిట్టావార్ లింగమ్మ రూ.60వేలు, బేల మండలకేంద్రానికి చెందిన కండెవార్ రవీందర్ రూ. 60వేలు , ప‌లాయ్ తాండ కు చెందిన చ‌వాన్ స‌రాబాయ్ రూ.60వేలు,ద‌స్నాపూర్ కు చెందిన చింత‌ల స్వరాజ్ గౌడ్ రూ.60వేలు,బేల మండ‌లం అవాల్ పూర్ కు చెందిన జ‌క్కుల యోగేష్ రూ.60వేలు, జైన‌థ్ మండ‌లం క‌న్ప కు చెందిన క్యాత ప‌ద్మ రూ. 60 వేలు , భోరజ్ మండలం గూడ కు చెందిన సూరం రజిత రూ.22వేల 5వంద‌లు, భోరజ్ మండలం కాప్రి కి చెందిన ఏనుగు లచ్చరెడ్డి రూ. 25వేల విలువ గ‌ల చెక్కు లను అందించారు. మొత్తం 5ల‌క్ష‌ల 27వేల 5వంద‌ల విలువ గ‌ల ప‌ది చెక్కుల‌ను పంపిణీ చేసారు. సీయంఆర్ ఎఫ్ స‌హాయం కోసం త‌న క్యాంపు కార్యాల‌యం లో ప్ర‌త్యేక కౌంట‌ర్ ఏర్పాటు చేసామ‌ని ఆసుప‌త్రుల్లో డ‌బ్బుల పెట్టి వైద్యం చేయించుకున్నవారికి ముఖ్య మంత్రి స‌హాయ నిధినుండి ఆర్థిక సాయంకోసం ద‌ర‌ఖాస్తు పెట్టుకోవ‌చ్చ‌న్నారు.ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు 41ల‌క్ష‌ల విలువ గ‌ల చెక్కుల‌ను పంపిణీ చేసిన‌ట్టు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో జీసీసీ చైర్మ‌న్ కొట్నాక తిరుప‌తి, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, జిల్లా గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ మ‌ల్లెపూల న‌ర్స‌య్య‌,టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఆత్రం సుగుణ‌,సెడ్మ‌కె ఆనంద రావు, భూప‌ల్లి శ్రీ‌ధ‌ర్ , గుడిప‌ల్లి న‌గేష్,గిమ్మ‌సంతోష్ ,సామ రూపేష్ రెడ్డి, క‌లాల శ్రీ‌నివాస్, మునిగెల విఠ‌ల్, ఎంఏ ష‌కీల్, రామ్ కుమార్,ఫైజుల్లా ఖాన్, రాందాసం నాక్లే, దాస‌రి ఆశ‌న్న‌, శ్రీ‌లేఖ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Latest