Mahaa Daily Exclusive

  న్యాయం వైపు నిలబడతాం… అట్రాసిటీ మెంబర్ శశికాంత్…!

Share

తలమడుగు మహాన్యూస్:
ఏ స్థాయిలో ఉన్న న్యాయంగా ఉన్న పేద వర్గాల ప్రజల వైపు నిలబడాలని ప్రశ్నించే గొంతు గా మారాలని మాల సామాజిక వర్గానికి చెందిన ఒక్కొక్కరి ఎదుగుదల నేటి సమాజ ప్రజల అభ్యున్నతికై వారి సేవకై ఆదర్శంగా నిలవాలని నిలిచినప్పుడు మన జాతికి ఉన్నతమైన స్థాయి తీసుకువచ్చిన ఆ వ్యక్తులకు గౌరవం దక్కుతుందని మండల మాల సంక్షేమ సంఘం అధ్యక్షులు గుంటి క్రాంతి కుమార్ అన్నారు. తలమడుగు మండల కేంద్రంలోని మాల సంక్షేమ సంఘం మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా అధికారులచే నియమితులైన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఎన్నుకోబడ్డ ఐండ్ల శశికాంత్, బిజెపి మండల అధ్యక్షులుగా నక్క ధనుంజయ్, కాంగ్రెస్ మందల యూత్ అధ్యక్షునిగా చిన్నెల సాయికిరణ్ లు ఇటీవల నియమితులైనందున ఆదివారం రోజు వారిని కుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో సత్కరించి ప్రజలకు మరింత సేవ చేయాలని బతుకు బలహీన వర్గాల ప్రజలకు చేయూతగా ఉండాలని సంఘం సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు క్రాంతి కుమార్, సంఘం నాయకులు కిరణ్ కుమార్, గజానంద్, ప్రకాష్, పోచ్చన్న, గంగన్న, నర్సింలు, రవి, సత్యనారాయణ, శ్రీనివాస్, రాకేష్ మల్లేష్ తదితరులు ఉన్నారు.

Latest