Mahaa Daily Exclusive

  వైభవంగా ఆషాడ మాసం బోనాల జాతర… అఖిల గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక శోభాయాత్ర … ఆకట్టుకున్న మహంకాళిఅమ్మవారు… పోతరాజుల విన్యాసం…!

Share

ఆదిలాబాద్, మహా

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక నిలిచే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు జిల్లా వ్యాప్తంగా వైభవంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో అఖిల గాండ్ల తెలికుల సంఘం ఆధ్వర్యంలో సామూహిక బోనాల శోభాయాత్ర ను ఆదివారం ఉత్సాహంగా నిర్వహించారు. స్థానిక మార్వాడి ధర్మశాల వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ముందుగా గాండ్ల కులస్తులు కుండలకు ప్రత్యేక పూజలు చేసి, బోనం కుండను తలపై ఎత్తుకొని శోభయాత్రలో పాల్గొన్నారు. బోనాల జాతర సందర్భంగా మహంకాళి అమ్మవారు, పోతరాజులు, పెద్దపులి వేషధారణలో చేపట్టిన విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మార్వాడి ధర్మశాల నుండి పట్టణ పురవీధుల గుండా అశోక్ రోడ్ లోని పెద్ద పోచమ్మ వరకు శోభాయాత్ర ఉత్సాహంగా సాగింది. అనంతరం మహిళలు అమ్మవారికి బోనాలను సమర్పించి, మొక్కలను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల కుల సంఘం నాయకులు, కులస్తులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest