కర్ణాటకలోని కలబురగి జిల్లా యాద్రామిలోని కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పాఠశాల హెచ్ఎం విజయశ్రీ పాటిల్ సిబ్బందితో వ్యక్తిగత పనులు చేయించుకుంటున్నారు. క్లాస్ రూమ్‌లోనే మహిళా సిబ్బందితో ఆమె మసాజ్ చేయించుకున్నారు. వ్యక్తిగత పనుల కోసం సిబ్బందిని ఆమె బెదిరిస్తున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Post Views: 89








