Mahaa Daily Exclusive

  ఘనంగా ఖర్గే జన్మదిన వేడుకలు..!

Share

ఆదిలాబాద్, మహా :
ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుక‌ల‌ను ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీ‌నివాస రెడ్డి క్యాంపు కార్యాల‌యం ప్ర‌జాసేవాభ‌వ‌న్ లో సోమ‌వారం ఘ‌నంగా నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున హాజ‌రైన కాంగ్రెస్ శ్రేణులు కేక్ క‌ట్ చేసి ఒక‌రికొక‌రు తినిపించుకొని ఖ‌ర్గే జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను జ‌రుపుకున్నారు. మ‌ల్లికార్జున ఖ‌ర్గేకు హృదయపూర్వక జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతున్నామ‌న్నారు.ఈ సంద‌ర్భంగా నాయ‌కులు గిమ్మ సంతోష్ మాట్లాడుతూ ఖ‌ర్గే నిరంతర పోరాట స్ఫూర్తికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు.83 ఏళ్ల వ‌య‌సులో కూడా పార్టీ బ‌లోపేతం కోసం దేశ ప్ర‌జల‌ సంక్షేమం కోసం అలుపెర‌గ‌కుండా శ్ర‌మిస్తున్నార‌ని కొనియాడారు. ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత శక్తివంతంగా ముందుకు సాగుతోంద‌న్నారు. బలమైన లోకతంత్రం, సమానత్వం కోసం ఆయన చేస్తున్న కృషి ఆదర్శంగా నిలుస్తోంద‌న్నారు. ఈ జన్మదినం సందర్భంగా ఖర్గే కు దీర్ఘాయుస్సు ఆయురారోగ్యాల‌ను ప్రసాదించాలని భ‌గ‌వంతున్ని ప్రార్ధిస్తున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు మునిగెల విఠ‌ల్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రంగినేని శాంతన్ రావు, నాయకులు సుకేందర్,సింగిరెడ్డి రామ్ రెడ్డి,దొగ్గలి రాజేశ్వర్,దాసరి ఆశన్న, తిరుమల్ రెడ్డి, ఖలీల్,రఫీక్, అతిక్ ఉర్ రహమాన్,శ్రీ‌లేఖ‌, తమ్మల చందు, మొహమ్మద్ రఫీక్, ముత్యాల నిఖిలేష్, రాజీవ్, ఎల్మ రామ్ రెడ్డి, సాహెబ్ రావు, సట్ల నాగన్న, రాస్పత్, లింగన్న, డేరా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest