Mahaa Daily Exclusive

  స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి -జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్..!

Share

ఆదిలాబాద్, మహా

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు సిబ్బంది సంసిద్ధమై ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం ఆదిలాబాద్ వన్ టౌన్ స్టేషన్ ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేసి సిబ్బంది విధులను పరిశీలించారు. ప్రతి ఒక్క వార్డుకు వీపిఓ ను కేటాయించి సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలపై పూర్తి సమాచారాన్ని రాబట్టాలని ఎస్పీ సూచించారు. పట్టణంలో ఎలాంటి గంజాయి, గేమింగ్, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ నిర్వహించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విధులను ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, క్రమశిక్షణ సమయపాలనతో ఉండాలన్నారు. కేసుల నమోదు దర్యాప్తులో ఎలాంటి జాప్యం వహించకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. పట్టణాన్ని వివిధ భాగాలుగా విభజించి ఎస్ఐ అధికారుల పర్యవేక్షణతో కేటాయించి కేసుల దర్యాప్తును కేటాయించి ప్రతి ఒక్కరికి సమానమైన విధులు వచ్చే విధంగా పర్యవేక్షించాలన్నారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉంటూ విధులను విభజించుకొని కలిసిమెలిసి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్, ఎస్ఐలు జి నాగనాథ్, రమ్య, పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest