వరంగల్ మహా;
ట్రేడ్ లైసెన్స్ వసూళ్ల పై ప్రత్యేక దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ లో శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలని, ప్రతి వార్డులో ఇద్దరు జవాన్లు మాత్రమే విధులు నిర్వహించాలని, అంతకుమించి ఎక్కువమంది జవాన్లు ఉంటే వారిని ఇతర అవసరాల కోసం వినియోగించు కోవాలని సిఏంహెచ్ ఓ ను ఆదేశించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ ను నాలుగు సార్లు క్రమం తప్పకుండా వేసేలా చూడాలని, ప్రభుత్వ పారిశుద్ధ్య సిబ్బంది కి బదిలీ వర్కర్ గా అవకాశం లేదని, ఔట్సోర్సింగ్ సిబ్బంది ఎవరైనా అచేతన స్థితి లో ఉంటే వారి కుటుంబ సభ్యుల ఆమోదం మేరకు అధికారులు పరిశీలించి బదిలీ వర్కర్ గా అవకాశం కల్పిస్తారని కమిషనర్ అన్నారు.
ఈ కార్యక్రమం లో సి ఏం హెచ్ ఓ డా.రాజారెడ్డి ఏం హెచ్ ఓ డా.రాజేష్ సానిటరీ సూపర్ వైజర్ లు భాస్కర్ నరేందర్ తో పాటు సానిటరీ ఇన్స్పెక్టర్ లు తదితరులు పాల్గొన్నారు.








