Mahaa Daily Exclusive

  యూరియా సరిపడా ఉంది.. రైతులు ఆందోళన చెంద వద్దు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..!

Share

వరంగల మహా;

వరంగల్ జిల్లాలో సాగుచేస్తున్న పంటలకు సరిపోను యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.
మంగళవారం నల్లబెల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘ సొసైటీను కలెక్టర్ సత్య శారద తనిఖీ చేసి యూరియా నిల్వలు, అమ్మకాలు, ధరలు, ఇతర ఎరువుల నిల్వలను పరిశీలించారు.
నల్లబెల్లి మండలంలో రైతులు యూరియా కొరకు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో వచ్చిన కథనాల మేరకు కలెక్టర్ మంగళవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా లక్ష 71 వేల 595 ఎకరాల్లో రైతులు పత్తి, మొక్కజొన్న ఇతర పంటలు వేశారని తెలిపారు. ఎకరానికి ఒక బస్తా (45 కిలో గ్రాముల) యూరియా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని కలెక్టర్ అన్నారు.

జిల్లా రైతులకు కావాల్సిన యూరియాను అందుబాటులో ఉంచామన్నారు. రైతులు ముందస్తుగా యూరియా ను కొనుగోలు చేసి పంట పోలాళ్లలో నిల్వ చేసుకుంటున్నారని, దానికోసం అందరు రైతులు ఒకేసారి రావడంతో కొంత ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లా రైతులకు సరిపడా యూరియా ఆయా కేంద్రాలకు విడుతల వారీగా అందజేస్తున్నామని తెలిపారు. ప్రతీ నెల రైతులకు అవసరమున్నా యూరియా హకా, మార్క్ ఫేడ్ ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ డీలర్ల వద్ద యూరియా ఉందని ఇప్పటి వరకు జిల్లాకు 16 వేల 865 మెట్రిక్ టన్నులు యూరియా రాగా,
11వేల 171 మెట్రిక్ టన్నులు రైతులకు అందిచామని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి యూరియా తెప్పిస్తామని అన్నారు. యూరియా ను బ్లాక్ చేసిన, అధిక ధరలకు అమ్మిన చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కలెక్టర్ వెంట డిఎఓ అనురాధ, డిసి ఓ నీరజ, ఆర్డీఓ ఉమారాణి ఏ వో రాజిత తదితరులు ఉన్నారు

Latest