కూసుమంచి, జులై 22, మహా:
కూసుమంచి మండలంలోని కూసుమంచి, పాలేరు, నరసింహులగూడెం చౌటపల్లి, జీళ్ళచెరువు గ్రామాల్లోని ఎరువుల దుకాణాలను మండల వ్యవసాయ అధికారి రామడుగు వాణి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డీలర్లు ఎరువుల ధరల పట్టిక, నిలువ వివరాలను రైతులకు కనిపించేలాగా ప్రదర్శించాలని, ప్రతిరోజు ప్రారంభ నిల్వను తప్పనిసరిగా ప్రతిరోజు నమోదు చేయాలని సూచించారు. ఎరువుల విక్రయాలు ఈపీఓఎస్ మిషన్ ద్వారా మాత్రమే జరపాలని సూచించారు. తప్పనిసరిగా యూరియా విక్రయాలను రైతు వారీగా రిజిస్టర్ లో పొందుపరచాలని సూచించారు. లైసెన్స్ లో ఓ ఫాములను పొందుపరచుకోవాలని తెలియజేశారు. యూరియాకు కృత్రిమ కొరత సృష్టించరాదని సూచించారు.
Post Views: 59








