కారేపల్లి, మహా: ఆపదలో ఉన్నారు అంటే ముందుండే మనస్తత్వం పేదల పక్షాన నిలిచే పోరాడే తత్వం మేదరి కుటుంబానికి అనతినుండే ఉంది మాటిచ్చారంటే కచ్చితంగా నెరవేర్చే మనస్తత్వం మేదరి బ్రదర్స్ కు ఉందని నిరూపించుకున్నారు కారేపల్లి బాధిత కుటుంబానికి అండగా ఉండి ఆదుకుంటామని మాట ఇచ్చి నిలుపు కున్నామని కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేదరి వీర ప్రతాప్ (టోనీ) అన్నారు. మంగళవారం కారేపల్లి లో ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ని చేపట్టారు. కారేపల్లి బీసీ కాలనీకి చెందిన రావుల రాఘవులు మూడేళ్ల కిందట కిడ్నీలు ఫెయిల్ కావటంతో మంచానికే పరిమితమై దిక్కు తోచని స్ధితిలో ఉన్నాడు. ఇద్దరు ఆడపిల్లలు చదువులు కొనసాగించలేక, ఉండటానికి ఇల్లు లేకుండా ఉన్నాడు. కూలి నాలీ చేసుకుంటేనే పూటగడిచే దీనస్థితిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఆ కుటుంబం వేధనకి గురైంది. ఆ సమయంలో కాంగ్రెస్ నాయకులు మేదరి టోనీ నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చి ఆర్ధికంగా సాయం అందించారు. ఇదే క్రమంలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ద్వారా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించి హక్కు పత్రాన్ని రాఘవులు భార్య రమాదేవి కి అందజేశారు. ఇచ్చిన మాట నిలుపుకున్న మేదరి టోనీ ని గ్రామస్తులు అభినందించారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ తాజుద్దీన్, మేదరి రాజా తదితరులు పాల్గొన్నారు.








