Mahaa Daily Exclusive

  మోతాదుకి మించి యూరియా వెయ్యటం వలన నష్టమే. షాప్ లో యూరియా స్టాక్ బోర్డ్ ఏర్పాటు చేయాలి: డి ఏ ఓ పుల్లయ్య..!

Share

మహా న్యూస్ జూలై 22 కొణిజర్ల

కొణిజర్ల మండలం లో రైతులకు యూరియా అందుబాటులో వుంది అని. రైతులు ఎవరు అధైర్య పడవద్దు అని డీఈవో పుల్లయ్య తెలిపారు. మంగళవారం డీఈవో పుల్లయ్య మరియు ఏ ఓ బాలాజీ మండల పరిధిలోని ఎరువుల దుకాణాలను తనికి చేసేరు. ఈ సందర్భంగా డీఈవో పుల్లయ్య మాట్లాడుతూ రైతులు ఎవరు ఆదర్య పడవద్దు అని . రైతులు వారికీ కావలిసిన యూరియా మాత్రమే తీసుకొని వెళ్ళాలి అని సూచించారు.యూరియా కొరత వస్తది అని పంట కాలానికి మొత్తం ఒకసారే తీసుకొని వెళ్ళాలి అని కొందరు రైతులు ప్రయత్నం చేస్తున్నారు అని. మనకు కేద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే యూరియా నెల వారి కోటాలో మాత్రమే పంపిస్తారు రైతులు కూడా ఇప్పుడు వున్న అవసరాలకు మాత్రమే తీసుకొని వెళ్తే నే . మిగిలిన రైతులకు అందరికి సరి పోతుంది తెలిపేరు.డీలర్స్ కూడా వారి షాప్ లో స్టాక్ ఎంత వున్నది అన్నది బయట బోర్డు మీద రాసి ఉండాలి అని అన్నారు.ప్రతి రైతుకు భూమి ఎంత వున్న 4 బ్యాగ్ లు కంటే ఎక్కువ ఇవ్వొద్దు అని అన్నారు.ఆధార్ కార్డు లేకుండా యూరియా ఎవ్వరికీ ఎవ్వవద్దు అని డీలర్లను ఆదేశించారు.బయట మండలం రైతులు వస్తే ఇవ్వవద్దు ప్రతి మండలం లో యూరియా వుంది, వాళ్ళు యూరియా నీ వ్యవసాయేతర అవసరాలకు వాడే అవకాశం వుంది అంటే నకిలీ పాలు, చేపల చెరువులలో క్వారీ బాంబు ల తయారీలో యూరియా వాడే అవకాశం వుంది డీలర్స్ ఎవ్వరు రైతులకు ఇతర ఎరువులు బలవంతంగా లింక్స్ పెట్టవద్దు, రైతులు ఎవరు అయినా పిర్యాదు చేస్తే ఎరువుల చట్ట ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవటం జరుగుతుంది అని తెలిపేరు.

రైతులు కూడా యూరియా వాడకం వలన అవగాహన కలిగి ఉండాలి మోతాదుకి మించి యూరియా వెయ్యటం వలన ఉపయోగం కంటే నష్టం ఎక్కువ ఉంటుంది అని అన్నారు .భూమి సారం పోతుంది, భూమి భౌతిక స్థితి మారుతుంది, చీడ పీడలు బాగా పెరిగి పెట్టుబడి పెరిగే దిగుబడులు తగ్గుతాయి, భూమిలో క్షార గుణం పెరుగుతుంది అందుకని తక్కువ రేటు వుంది అని ఎక్కువ యూరియా వేయుటం వలన నష్టం అన్నది రైతు సోదరులు గ్రహించాలి అని సూచించారు.

Latest