భద్రాద్రి కొత్తగూడెం, జూలై 22 (మహా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పి.వీ కాలనీ సింగరేణి ఉన్నత పాఠశాల పాఠశాలను ఎడ్యుకేషనల్ జి. యం. మురళీధర్ రావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి ఉపాధ్యాయులతో విద్యార్థుల ప్రగతిని గురించి చర్చించారు. పాఠశాలకు కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్స్, స్పోర్ట్స్ రూమ్, లైబ్రరీ లను తనిఖీ చేశారు. పాఠశాలకు అవసరమైన అవసరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులను సమీక్షిస్తూ ఉపాధ్యాయులందరూ ఖచ్చితమైన సమయపాలన పాటించాలని, సింగరేణి యాజమాన్యం అందిస్తున్న సదుపాయాలను సక్రమంగా ఉపయోగించుకోవాలని విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని ఈ సందర్భంగా సూచించారు. పదవ తరగతి ఉపాధ్యాయులతో సమీక్షిస్తూ గత సంవత్సర ఉత్తీర్ణత శాతాన్ని అడిగి తెలుసుకున్నారు, అలాగే ఈ సంవత్సరం కూడా అంతకన్నా ఎక్కువ కష్టపడి వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రమేష్ , ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం వేణు, సీనియర్ ఉపాధ్యాయులు మస్తానయ్య, కృష్ణ బాబు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.








