టేకులపల్లి మండల సిపిఐ కార్యదర్శి వర్గం సమావేశం అయిత శ్రీరాములు అధ్యక్షతన జరిగింది. ఈ సంద్భంగా రామ్ చందర్ మాట్లాడుతూ… ఈనెల 26. 27వ తేదీల్లో అశ్వరావుపేటలోని శ్రీ శ్రీ ఫంక్షన్ హాల్ జరిగే సిపిఐ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చారిత్రాత్మక పోరాటాల ప్రాంతం. ఏజెన్సీ గ్రామాలకు కేంద్రమైన అశ్వరావుపేటలో జిల్లా మహాసభలను నిర్వహిస్తున్నామని. ఈ సభకు పార్టీ శ్రేణులు. కార్యకర్తలు. ప్రజా సంఘాల బాధ్యులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా మహాసభలో భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన. జిల్లా అభివృద్ధి సాధన. రానున్న ముందు రోజుల్లో కార్యాచరణను నిర్ణయిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు అయిత శ్రీరాములు. ఎజ్జు భాస్కర్. గూగులోత్ శ్రీను. కర్లపూడి సుందర్ పాల్. జి సోనీ తదితరులు పాల్గొన్నారు








