తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోన్న మహాలక్ష్మీ పథకంతో రాష్ట్ర ఆర్టీసీ మరో మైలు రాయిని దాటింది. ఇప్పటివరకు తెలంగాణ ఆర్టీసీలో 200 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణించారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందుకోసం రూ.6700 కోట్లు ప్రభుత్వం RTCకి విడుదల చేస్తోందని పేర్కొన్నారు. 200 కోట్ల మంది మహిళల ఉచిత ప్రయాణం పురస్కరించుకుని రేపు రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.
Post Views: 38








