ఖమ్మం అర్బన్, మహా.
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి బోడేపూడి విజ్ఞాన కేంద్రం సేవలు ప్రశంసనీయమని మిత్ర ఫౌండేషన్ అధ్యక్షులు కురివెళ్ల ప్రవీణ్ తెలిపారు బుధవారం బి వి కే ఆధ్వర్యంలో కుట్టు మిషన్ల శిక్షణ పూర్తి చేసుకున్న 40 మంది మహిళలకు ఉచితంగా మిత్ర ఫౌండేషన్ ఎన్నారై పౌండేషన్ ఆధ్వర్యంలో కుట్టు మిషన్లు పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు వైద్య సేవలు అందించడం విద్యార్థులు ఉద్యోగాలు కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి నామమాత్రపు ఫీజు తో హాస్టల్ వసతి గ్రంథాలయం కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలతో బి వి కే సేవలు అమోఘమని ఆయన తెలిపారు బి వి కె జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో బి వి కే కార్యదర్శి నున్న నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్ అయిన ఉద్యోగులు ఉపాధ్యాయులు సమాజ సేవలో భాగంగా అంకితభావంతో చేస్తున్న కృషి ఫలితంగా బి వి కే కార్యక్రమాలు విజయవంతం అవుతున్నాయని మహిళలకు నాలుగు నెలలపాటు టైలరింగ్ లో శిక్షణ ఇప్పించడంలో సభ్యుల కృషి ఘనమన్నారు బి వి కే జనరల్ మేనేజర్ వై శ్రీనివాసరావు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు అందించడంలో దాతల ఆర్థిక సహకారం కూడా కారణం అన్నారు ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు కే హిమబిందు సభలో ప్రసంగిస్తూ టైలరింగ్ శిక్షణ పూర్తి చేసిన మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలన్నారు స్త్రీలు ఆర్థికంగా ఎదిగినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని అన్నారు సభలో పెన్షనర్స్ సంఘం జిల్లా కార్యదర్శి కే నాగేశ్వరరావు టి పి ఎస్ కే జిల్లా కార్యదర్శి పి ఝాన్సీ ఎన్ గోవిందరావు వి వీరభద్రం ఎస్.కె అఫ్జల్ మియా జీ రామారావు టి వెంకట్రావు జాన్ బి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు








