జూలూరుపాడు జూలై 23 (మహా):: వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన జూలూరుపాడు విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోతు వంశీ, ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పరిమళ పవన్ కుమార్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా దాదాపు 8 వేల కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం ఏర్పడి దాదాపు 19 ఏళ్లు కావస్తున్న ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం బాధాకరమైన విషయమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విద్యాశాఖ మంత్రిని కేటాయించి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని అన్నారు. తక్షణమే ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వారు అన్నారు. ఈ బందుకు అఖిలభారత యువజన సమాఖ్య
ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి షేక్ చాంద్ పాషా సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యార్థి యమజనులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు చాపల మడుగు హర్ష వర్ధన్ సాయి తేజ రామ్ చరణ్ వాసు, ఏఐవైఎఫ్ మండల నాయకులు పవన్ కుమార్, నాగరాజు సంతోష్ కిరణ్ కుమార్ సురేష్ తదితరుల పాల్గొన్నారు.








