ఖమ్మం, మహా.
ఏ.టి.సి. కోర్సులతో యువతకు ఉపాధి భరోసా లభిస్తుందని, ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ఐటిఐ కళాశాలలను ఏ.టి.సి. లుగా అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ లను ప్రారంభించిందని, ఖమ్మం జిల్లాలో ఉన్న ఐటిఐ టేకులపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ మంజూరు కావడం జరిగిందని అన్నారు. ఏటీసీ సెంటర్ లో నూతనంగా 6 కోర్సులలో 172 సీట్లు అడ్మిషన్స్ ప్రారంభించగా, 128 సీట్లు ఖాళీగా ఉన్నాయని అన్నారు.
10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు ఏ.టి.సీ. కోర్సులు పొందేందుకు అర్హులని అన్నారు. ఈ కోర్సులతో మల్టి నేషనల్ కంపెనీలలో ఉద్యోగావకాశాలు లభిస్తాయని అన్నారు.
2025-26 విద్యా సంవత్సరంలో మన జిల్లాలో ఏటీసీ సెంటర్ లో ఒక సంవత్సరం కాలపరిమితి గల మ్యాను ఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ లో 37 సీట్లు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యాను ఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ లో 28 సీట్లు, ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ కోర్సులలో 18 సీట్లు ఖాళీగా ఉన్నాయని, రెండు సంవత్సరాల కాల పరిమితి గల బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానికల్)లో 22 సీట్లు, అడ్వాన్సుడ్ సి.ఎన్.సి. మిషనింగ్ టెక్నీషియన్ లో 13 సీట్లు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సులలో 10 సీట్లు ఖాళీగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్ డిమాండ్ ప్రకారం టాటా కన్సల్టెంట్స్ వారితో సమన్వయం చేసుకొని ఈ కోర్సులను డిజైన్ చేశామని అన్నారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొని కోర్సులలో జాయిన్ కావాలని కలెక్టర్ కోరారు.
ప్రభుత్వ ఐటిఐ ఖమ్మం లో అడ్మిషన్ కొరకు iti. telangana.gov. in అనే వెబ్ సైట్ లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని కలెక్టర్ తెలిపారు.
నూతనంగా ఏటీసీ కోర్సులకు సంబంధించి ప్రాక్టికల్స్ నిర్వహణకు అవసరమైన పరికరాలను నూతనంగా నిర్మించిన భవనంలో అమర్చడం వలన విద్యార్థులకు మరింత నాణ్యమైన బోధన అందుతుందని అన్నారు.
కొంతమంది మహిళలు మధ్యలోనే చదువు మానేస్తున్నారని, డ్రాప్ ఔట్ స్టూడెంట్ లను గుర్తించి వారికి ఐటిఐ, ఏటీసీ కోర్సులపై అవగాహన కల్పిస్తున్నామని, మహిళలకు సంబంధించి ఐటిఐ లో డ్రెస్ మేకింగ్, కంప్యూటర్, స్మార్ట్ అగ్రికల్చర్ లాంటి ఏడాది కోర్సుల ద్వారా ఉపాధి అవకాశాలు ఉన్నాయని, కోర్సు కాల పరిమితి తక్కువగా ఉన్నందున చదువు మధ్యలో మానేసిన వారికి ఉపయోగంగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
ఇండస్ట్రియల్ రోబోటిక్స్, డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోర్సు అనంతరం రోబోటిక్ టెక్నీషియన్, డిజిటల్ మ్యానుఫ్యాక్చర్ ఇంజనీర్, ఆటోమేషన్, పారిశ్రామిక రంగాల్లో నైపుణ్య సిబ్బందిగా రాణించవచ్చని అన్నారు. మ్యానుఫ్యాక్చ రింగ్, ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ కోర్సు అనంతరం ఆటోమోటివ్, ఏరోస్పేస్, ఔషధ, ఆహార శుద్ధి, రసాయన, వస్త్ర, చమురు శుద్ధి రంగాల్లో అవకాశాలు లభిస్తాయని, ఆటోమేషన్ టెక్నీషియన్, ప్రాసెస్ కంట్రోల్ ఇంజనీర్, నాణ్యత నియంత్రణ ఇన్స్పెక్టర్, రోబోటిక్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్ వంటి ఉద్యోగాలు అవకాశాలు ఉంటాయని తెలిపారు.
ఆర్టిజన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్ కోర్స్ చేతివృతులు, హస్తకళలు, ఆభరణాలు, వాచ్ మేకింగ్ ఏరోస్పేస్, డిఫెన్స్, ఆటోమేషన్ తదితర రంగాల్లో ఉపాధి కల్పించే కోర్సు అని, మాస్టర్ క్రాప్స్ మాన్, డై మేకర్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్ మేకర్, జ్యువెలరీ ఫర్నిచర్ డిజైనర్ వంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైర్ (మెకానికల్) కోర్సు అనంతరం మెకానికల్ డిజైనింగ్ ఇంజనీర్, వెరిఫికేషన్ ఇంజనీర్, సిఏటి టెక్నిషన్, ఎనలిస్ట్, వర్చువల్ టెస్టింగ్ ఇంజనీర్, ప్రొడక్షన్ డెవలప్మెంట్ ఇంజనీర్ గా అవకాశాలు ఉంటాయని తెలిపారు.
అడ్వాన్సుడ్ సి.ఎన్.సి మిషనింగ్ టెక్నీషియన్ కోర్సు అనంతరం సి.ఎన్.సి. మెషిన్ టెక్నీషియన్, ప్రోగ్రాం డిజైనర్, కోడ్ రైటర్, ప్రోడక్ట్ డిజైనర్ వంటి అవకాశాలున్నాయన్నారు.
మెకానిక్ ఎలక్ట్రికల్ వెహికల్ కోడ్స్ అనంతరం ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ టెక్నీషియన్, ఈవి మెయింటెనెన్స్ ఇంజనీర్, సర్వీస్ సెంటర్ మేనేజర్ వంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఖమ్మం లోనే టేకులపల్లి ఐటిఐలో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్లో 6 నూతన కోర్సులు, ఐటీఐ కోర్సుల ద్వారా భవిష్యత్తు ఉంటుందని యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందుతుందని, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.








