నేలకొండపల్లి, జూలై 23 మహా:
హైదరాబాద్ లోని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిశారు పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు,ముఠాపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు బెల్లం వాసు లు కలిశారు. ఈసందర్భంగా ముఠాపురం గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి కి విన్నవించారు.గ్రామంలో ఇంకా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వాలని కోరారు.దానితో పాటు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని పేదలకు పంపిణీ చేయాలని మంత్రిని కోరారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇచ్చే విధంగా చూడాలని మంత్రికి వారు విన్నవించారు. అనంతరం మంత్రి నీ ఘనంగా సన్మానించారు.
Post Views: 70








