కాటారం, మహా : భూపాలపల్లి జిల్లా కాలేశ్వరం లోని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవాలయంలో ఖాళీగా ఉన్న ఐదు అర్చకుల నియామకం కోసం బుధవారం పరీక్షలు నిర్వహించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ హైదరాబాద్ కార్యాలయం లోని ధ్యాన మందిరంలో సెలక్షన్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించారు.
40 మంది సభ్యులకు హాల్ టికెట్స్ పంపగా పరీక్షలో 32 మంది పాల్గొన్నారు.
సంగనబట్ల విజయకుమార్ , పనకంటి కశ్యప్ శర్మ, రావుల రాజకుమార్, త్రిపురారి శ్రవణ్ కుమార్,కాకిరాల పవన్ శర్మ లు ఎంపికయ్యారు. ఎందుకైనా అభ్యర్థులకు నియామకపు ఉత్తర్వులు ఇస్తామని ఆలయ ఈవో మహేష్ ఒక ప్రకటనలో తెలిపారు.
ముక్తేశ్వర స్వామి దర్శించుకున్న చత్తీస్గడ్ ఎమ్మెల్యే
సరిహద్దు చత్తీస్గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ శాసనసభ్యులు విక్రమ్ మాండవి బుధవారం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికి స్వామివారికి అభిషేకం అమ్మవారి ఆలయంలో దర్శనం చేయించారు. స్వామి వారి శేష వస్త్రాలతో సన్మానించి అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదం అందజేశారు.








