Mahaa Daily Exclusive

  ఆర్టీసీ ఉచిత ప్రయాణం తో మహిళలకు దక్కిన గౌరవం మహాలక్ష్మి పథకం మహిళలకు ఓ వరం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ..!

Share

వరంగల్ మహా;

మహాలక్ష్మి పథకం తో మహిళలకు అరుదైన గౌరవం దక్కిందని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణం చేసి 66 80 కోట్ల రూపాయల ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా వరంగల్ ఆర్టీసీ బస్ స్టేషన్ లో నిర్వహించిన సంబరాల్లో మంత్రి కొండ సురేఖ ముఖ్యఅతిథిగా హాజరై, నగరమేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, సిడబ్ల్యుఎంసీ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి కేక్ కట్ చేశారు. మహాలక్ష్మి తో మహిళా సాధికారతపై విద్యార్థులకు, మహిళలకు నిర్వహించిన వ్యాసరచన,రంగోలి పోటీలలో
గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా బస్ స్టేషన్ లో మహిళా స్వయం సహాయక సంఘాలచే ఏర్పాటుచేసిన వివిధ రకాల ఉత్పత్తుల స్టాల్స్ ను మంత్రి, మేయర్, కలెక్టర్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంతో ప్రతి మహిళలో చిరునవ్వు కనబడుతోందని,
ఆర్టీసీలో ఉచిత ప్రయాణంతో మహిళలకు అసలైన గౌరవమని అన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల మహిళలకు అసలైన గౌరవం దక్కుతున్నదన్నారు. మహాలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటివరకు 15.43 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఉచితంగా ప్రయాణించడం ద్వారా 690 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగా, వరంగల్ జిల్లాలో 4.54 కోట్ల మహిళలు ఉచితంగా ప్రయాణం చేసి 190 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారని మంత్రి తెలిపారు.

మహిళా సాధికారత కోసం ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా సెర్ప్ ఆధ్వర్యంలో ఆర్టీసీ లో అద్దెపై నిర్వహించుటకు మహిళా సంఘాలకు బస్సు తాళాలు మంత్రి అందజేశారు.
ఆర్టీసీ బస్టాండ్లలో మహిళా సంఘాల ద్వారా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుటకు స్టాల్స్ కేటాయించాలని అధికారులను సూచించారు.

ఉచిత బస్సు ప్రయాణం వల్ల దేవదాయ శాఖకు అదనంగా 176 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళల స్వాలంబనే ధ్యేయంగా ధయంగా ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిడబ్ల్యుఎంసి ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేసి మహిళలకు శిక్షణ ఇప్పించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అమలు పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, స్థానిక కార్పొరేటర్ అనిల్, డి ఆర్ డి ఓ కౌసల్యా దేవి, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ ఎం భాను కిరణ్, డిపో మేనేజర్, ధరమ్ సింగ్, తహసిల్దార్ ఇక్బాల్ మెప్మా డి ఎం సి రేణుక, టీఎంసీ రమేష్, సంబంధిత శాఖల అధికారులు, మహిళలు ప్రయాణికులు తదితరులు పాల్గొన్నారు.