ఖమ్మం , మహా .
మీ ఆధార్ కార్డ్ ద్వారా సిమ్ములు తీసుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు , జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ జరిగాయని, ఈ కేసులలో అరెస్టు చేస్తామని నేతాజీ నగర్ ఖమ్మం అర్భన్ మండలం కి చెందిన రిటైర్డ్ ఉద్యోగి ని బెదిరించి, డిజటల్ అరెస్టు చేసి సుమారు 59 లక్షల రుపాయలు మోసం చేసిన కేసులో ముగ్గురిని ఖమ్మం సైబర్ క్రైమ్ పోలీసులు అనంతపురం , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరెస్టు చేసినట్లు ఖమ్మం సి.పి. సునిల్ దత్ తెలిపారు. కేసు వివరాలలోకి వెళితే ఖమ్మం అర్భన్ మండలానికి చెందిన రిటైర్డ్ ఉపాద్యాయుడుని ఫోన్ లో జాబ్ ఫ్రాడ్స్ , మనీలాండరింగ్ కి పాల్పడ్డారని, బెంగళూరు పోలీసులమని, డిజిటల్ అరెస్టు చేస్తామని బెదిరించి ఏప్రిల్-2025 లో ఫలుదఫాలుగా సుమారు 59 లక్షలు రూపాయలు దోచుకున్న కేసులో రూ. 9 లక్షలు అకౌంట్ కి వెళ్ళిన డీ యెర్రి స్వామి, వయస్సు 35 సం,లును అరెస్ట్ చేసి విచారించగా తను , ఇంకో ఇద్దరు ఈ. లక్ష్మానాయక్ , వయస్సు 35 సం” లు మరియు కె .నారాయణ రెడ్డి, వయస్సు 49 సం” లు కలిసి నేరం చేసినట్లు ఒప్పుకున్నారు . అట్టి ముగ్గురిని అనంతపురం లో అరెస్ట్ చేసినట్లు, ముగ్గురు నిందితులను ఖమ్మం సైబర్ క్రైం కోర్టులో హాజరు పరచి, రిమాండ్ కి తరలించారని తెలిపారు. ఈ కేసు విచారణలో ముఖ్య పాత్ర వహించి, ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం లో నిందుతుల్ని అరెస్టు చేసి, ఖమ్మంకి తీసువచ్చి, రిమాండ్ చేసిన సైబర్ క్రైం ఇన్- ఛార్జి డి.ఎస్పి. టి లక్ష్మినారాయణ కి, ఇన్పెక్టర్ యాసిన్ అలీ ని, ఎస్సైలు రంజితకుమార్, సహకరించిన ఎస్సై విజయ్ కుమార్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఖమ్మం సి.పి. అభినందించారు







