Mahaa Daily Exclusive

  వైభవంగా ముత్యాలమ్మ తల్లి బోనాల వేడుక ..!

Share

కారేపల్లి, మహా: సింగరేణి మండల పరిధిలోని మేకల తండా, గ్రామ ప్రజలు, మహిళలు ఆదివారం ముత్యాలమ్మ తల్లికి అత్యంత భక్తిశ్రద్ధలతో బోనాలు నిర్వహించారు. మేకల తండా కు చెందిన మహిళలు బోనాలు తలపై ఎత్తుకొని ముందుగా గ్రామ దేవతలకు పూజలు చేసి డప్పువాయిద్యాలతో మేకల తండా.లో గల నాభిశిల వద్దకు చేరుకుని పసుపు కుంకుమ పూజలు చేసిన అనంతరం ముత్యాలమ్మ అమ్మవారి ఆలయానికి ప్రదర్శనగా వెళ్లి మొక్కులు సమర్పించారు.గ్రామాల ప్రజలు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని గ్రామ దేవతలకు నైవేద్యాన్ని సమర్పించి ముత్యాలమ్మ తల్లికి పసుపు, కుంకుమలతో చీరలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో బానోతు రామ్మూర్తి నాయక్, మంగిత్య నాయక్, యువ నేత గణేష్ నాయక్, శ్రీకాంత్ , మాజీ ఎంపీటీసీ రమేష్ , కబీర్, లచ్చిరాం, గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.