తల్లాడ, ఆగస్ట్ , 03, (మహా):-
సత్తుపల్లి మాజీ శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య ఆదివారం అన్నారుగూడెం,బాలపేట, గోపాలపేట గ్రామాలలో విస్తృతంగా పర్యటించారు
ఉదయం 10.00 గంటలకు.
బాలపేట గ్రామంలో ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ పూర్ణ కంటి వెంకటేశ్వరరావు తండ్రి ఇటీవల మరణించగా ఆ కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు.కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేశారు. అదేవిధంగా అన్నారుగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుంకర రోశయ్య ఇటీవల బైక్ ఆక్సిడెంట్ కారణంగా కాలు ప్యాచర్ తో గృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆదివారం ఆయనను సండ్ర పరామర్శించారు.అన్నారుగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ గుమ్మా నరేష్ వారి అన్న గుమ్మా కేశవరావు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని సందర్శించి కీర్తిశేషులు కేశవరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి,తన ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేశారు.నున్నా కృష్ణయ్య సతీమణి ఇటీవల మరణించగా ఆదివారం ఆయన కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు.
గోపాలపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ నున్నా జానకి రామయ్య కుటుంబాన్ని సందర్శించి. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, బాలపేట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ కోసూరి వెంకట నరసింహరావు, నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు,పులి వెంకట నరసయ్య,దుగ్గినేని సత్యనారాయణ,మారెళ్ళ దేవేందర్,గోవిందు నరేష్, పులి నరసింహారావు,గోన వీరయ్య,షేక్ హుస్సేన్ బేగ్, గుమ్మా నరేష్,గోపిశెట్టి నాగేశ్వరరావు, శనక్కాయల నరసింహారావు,చిట్టెం వీరయ్య,కందుల నారాయణ,ప్రభాకర్, శ్రీను,షేక్ నాగు, నరసింహారావు, నాగేశ్వరరావు,తదితరులు ఉన్నారు







