AP: బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాద ఘటనపై మంత్రి కొలుసు పార్థసారథి విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఆదివారం మంత్రి పార్థసారథి మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ తరహా ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Post Views: 128








