AP: బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంపై జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కష్ట కాలంలో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బల్లికురవ సమీపంలో సత్యక్రిష్ణ గ్రానైట్ క్వారీలో ఆదివారం బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందిన సంగతి తెలిసిందే.
Post Views: 45








