మంచిర్యాల, మహా : సహారా ఇండియా పరివార్ డిపాజిట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నస్పూర్ సిసిసి కార్యాలయం ముందర డిపాజిట్ దారులు
ప్లే కార్డ్స్ పట్టుకొని నిరసన ప్రదర్శన చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా సహారా బాధితులు మాట్లాడుతూ కాల పరిమితి దాటిన సహారా డిపాజిట్ లను వెంటనే చెల్లించాలని అన్నారు. సహారా ఇండియా పరివార్ లో డబ్బులు జమ చేసుకుంటే వృద్ధాప్యంలో ఖర్చులకు, పిల్లల వివాహాలకు, చదువులకు, గృహ నిర్మాణాలకు తదితర అవసరాలకు ఉపయోగపడతాయని జమ చేసుకుంటే వాటిని ఇవ్వకుండా సంస్థ కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
డిపాజిట్ గడువు పూర్తయిపోయి
డబ్బులను చెల్లించకుంటే
తాము ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మ హత్యలు చేసుకునుడే తప్ప మరో మార్గం లేదని హెచ్చరించారు. సహారా బాధితులను సమస్యల పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానందలు, వివిధ పార్టీలకు చెందిన స్థానిక ప్రజా ప్రతినిధులు, స్పందించి న్యాయం చేసే విధంగా కృషి చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో సహారా బాధితుల సంఘం నాయకులు గజెల్లి వెంకటయ్య, సహారా బాధితులు బొద్దున దుర్గయ్య , మాచెర్ల శ్రీనివాస్, మోతె కాంతయ్య , మిట్ట రమాదేవి , డి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.







