Mahaa Daily Exclusive

  రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికైన కాటారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు…!

Share

కాటారం, మహా :
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ నిర్వహించినజావాలిన్ విభాగ ,పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటారం విద్యార్థినిలు రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు.మాటూరి కావ్య 14 సంవత్సరాల విభాగంలో, సోయం వైష్ణవి 12 సంవత్సరాల విభాగంలో జావెలింగ్ త్రో ఈవెంట్లో లలో జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి,రాష్ట్రస్థాయికి ఎంపికైనారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయురాలు గుర్శింగ విజయలక్ష్మి తెలిపారు. వీరు జనగామ జిల్లా లో 7 వతేదిన రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ హట్కర్ సమ్మయ్య,పాఠశాల ఉపాధ్యాయని, ఉపాధ్యాయులు ఎంపికైనవిద్యార్థులను, వ్యాయామ ఉపాధ్యాయురాలిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుల. పద్మజ , రజిత, బొల్లం సతీష్, సుజాత, కవిత, రాజు నాయక్, ఇర్ఫాన్ , సద్గుణ మేడ విద్యార్థులు పాల్గొన్నారు