Mahaa Daily Exclusive

  రైతులకు సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది ల్యాబ్ ఇంచార్జ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం ఖానాపూర్ మండలం బుధరావుపేట
పిఎసిఎస్ , జడ్.పి.హెచ్.ఎస్ హై స్కూల్, ఎం జె పిఏ నెక్కొండ ను ఆకస్మిక తనిఖీ చేశారు.
ఈ తనిఖీల్లో భాగంగా పిఎసిఎస్ బుధరావుపేట ఆకస్మికంగా సందర్శించి రైతులతో కలెక్టర్ నేరుగా సంభాషించి, అధైర్య పడకూడదని సరిపడనంత యూరియా నిలువలు జిల్లాలో ఉన్నాయని, ప్రతి ఒక్క రైతుకు యూరియా సరఫరా చేయడం జరుగుతుందని, అన్నారు. పిఎసిఎస్ లో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఫోన్ పే ద్వారా రైతులకు యూరియా సరఫరా చేయాల్సిందిగా కలెక్టర్ సూచించారు. రైతుల తాకిడి ఎక్కువగా ఉన్నందున బుధరావుపేట లో పిఎసిఎస్ సెంటర్ను ఏర్పాటు చేయవలసిందిగా జేడి అగ్రికల్చర్ అనురాధ కు పలు సూచనలు చేశారు. ఏరువాక సాగు బడి పంటల ఆరోగ్య దీపిక కార్డును ప్రతి ఒక్క రైతుకు అందించాలని ఆ కార్డు తో పిఏ సిఎస్ సెంటర్స్ కి రావలసిందిగా జిల్లా కలెక్టర్ రైతులకు సూచించారు.
అనంతరం బుదరావుపేట జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ ను ఆకస్మికంగా తనఖి చేసి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించి పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.
స్కూల్లో పిల్లలకు విద్య అందించే విధానాన్ని పిల్లల ద్వారా తెలుసుకున్నారు.
పిల్లలకు సబ్జెక్టు మీద ఎలాంటి పట్టు ఉందో అని స్వయంగా పిల్లలకు ఇంగ్లీషు, హిందీ పాఠ్యాంశాలను చదివించారు. 9వ తరగతి పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.
క్లాస్ రూమ్ లో డిజిటల్ ప్యానెల్, కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్న కంప్యూ టర్లు నిరుపయోగంగా ఉన్నందుకు ల్యాబ్ ఇంచార్జ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిజిటల్ ప్యానెల్ మరియు కంప్యూటర్స్ లను రిపేరు చేయించి తీసుకురావాల్సిందిగా సూచించారు.
మిడ్ డే మీల్స్ భోజనశాలను , స్టోర్ రూమ్ ను పరిశీలించి నాణ్యత లేని బియ్యాన్ని వాడకూడదని, తాజా కూరగాయలు వాడాలని ఇంచార్జ్ ను ఆదేశించారు. నాణ్యతతో రుచికరమైన భోజనం చేయడంతో పాటు వంటల్లో కారం తగ్గించాలని వంట మనుషులకు సూచించారు.
పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి పిల్లలతో వారి స్కూల్ గురించి విద్యాబోధన,రోజువారీగా భోజనం ఎలా ఉంటుంది అనే అంశంపై పిల్లలతో మాట్లాడి తెలుసుకున్నారు.
అనంతరం మహాత్మ జ్యోతిబాపూలే ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లల కనీస అవసరాలు భోజన శాలను పరిశీలించి భోజనంలో అధిక కారాన్ని వేస్తున్నందున కుక్ ను మందలించి కారం తగ్గించాలని , కారం ఎంతవేయలో తూకం వేసి హాస్టల్ ఇంచార్జ్ కు సుంచించారు.
స్కూల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ ను పరిశీలించారు.
పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనం విషయంలో కావచ్చు విద్యాబోధన విషయంలో గానీ ఏ విధమైన సమస్యలు రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రిన్సిపాల్ దేనని, పిల్లల పట్ల నిబద్ధత కలిగి ఉండాలని ప్రిన్సిపాల్ జయశ్రీ కి సూచించారు.
కూరగాయల స్టోరేజ్ రూమ్ ను పరిశీలించి కుళ్లిపోయిన టమాటా బీట్రూట్ ను సరఫరా చేసినా కాంట్రాక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జెడి అగ్రికల్చర్ అనురాధ ఖానాపూర్ తహసిల్దార్ రమేష్ , ఏ వో శ్రీనివాస్ తదితరులు వారి వెంట ఉన్నారు.