వరంగల్ మహా;
వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని పలు డివిజన్ల పరిధిలో అర్ధరాత్రి నుండి మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ జన్మదిన వేడుకలు బిఆర్ఎస్ పార్టీ డివిజన్ల అధ్యక్షులు, అభిమానులు, కార్యకర్తలు, తదితరులు ఘనంగా నిర్వహించారు. మొదటగా నన్నపునేని నరేందర్ వాణి దంపతులు వరంగల్ బట్టల బజార్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ భద్రకాళి దేవస్థానం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. తదనంతరం 33 వ డివిజన్ లో బండ్లమూడి చరణ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన జన్మదిన సందర్బంగా 33 వ డివిజన్ అండర్ బ్రిడ్జ్ ఇసుక అడ్డా వద్ద భారీ కేక్ కట్టింగ్ చేపించి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడతూ ఎన్ని ఆస్తులు సంపాదించి నమని కాదు ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న మనదే ముఖ్యమని వారే నిజమైన నాయకుడుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోతాడని ఆయన అన్నారు. ఒక పేదింటి బిడ్డను అయినా నా జన్మదిన రోజున ఇంతటి సేవా కార్యక్రమాలు పండుగ లాగా నియోజకవర్గం మొత్తం గా చేయడం చాలా సంతోషంగా ఉందని నరేందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.








