వరంగల్ మహా;
చెత్త తరలింపు వాహనాల సమాచారం ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసిసిసి) కి అనుసంధానం చేయాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయం లో గల ఐసిసిసి కేంద్రాన్ని కమిషనర్ ఆకస్మికం గా తనిఖీ చేసి నిర్వహణ తీరును అధికారులు సిబ్బందినీ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా కమిషనర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రానికి సానిటేషన్ కు సంబంధించిన వాహనాలైన స్వచ్ఛ ఆటోలు చెత్త తరలింపు ట్రాక్టర్లు, జెసిబి లు, టిప్పర్లు అనుసంధానం చేయాలని, ఇట్టి వాహనాలు పనిచేస్తున్నాయా? వాహనాలు ఆగితే ఎందుచేత ఆగాయి? అని ఐ సి సి సి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ ట్రాన్స్ఫర్ స్టేషన్ లలోని పార్కింగ్ ప్రాంతాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేయాలని, సానిటరీ ఇన్స్పెక్టర్ల వారిగా కేటాయించిన వాహనాలకు ప్రత్యేక గుర్తింపు నంబర్ లను కేటాయించడం జరిగిందని, అట్టి లింక్ ను వారికి అందజేసిన తర్వాత ఆప్ ద్వారా వాహన దారులు డౌన్లోడ్ చేసుకొవాలని తర్వాత సానిటరీ ఇన్స్పెక్టర్ల వారిగా రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, 24/7 డ్యూటీ లో అందుబాటులో ఉండాలని, అలారం సిస్టమ్ పనిచేయాలని, డంప్ యార్డ్ లో ట్రాన్స్ఫర్ స్టేషన్ లను ఐసిసిసి కి అనుసంధానించి పని చేసేలా చూడాలని డి సెంట్రలైజ్డ్ ట్రాన్స్ పోర్ట్ కేంద్రాలను విలీన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని, కాంపాక్టర్ లను పునరుద్ధరించి 3 వాట్స్ సామర్ధ్యం తో ఒక్కో కాంపాక్టర్ ను ఏర్పాటు చేయాలని ఇంకా అదనం.గా ఉన్న జవాన్ లను టీమ్ లుగా ఏర్పాటు చేసి ప్లాస్టిక్ ఎన్ఫోర్స్మెంట్ లలో వినియోగించే విధం గా చూడాలని సిఎం హెచ్ ఓ ను ఆదేశించారు.
అనంతరం కమీషనర్
పుప్పాల గుట్టలోని ఏసియన్ పేయింట్స్ ప్లాంట్ ను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసారు. అలాగే టౌన్ ప్లానింగ్ కు సంబంధించి కాశీబుగ్గ, డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ ఫేజ్- 2 లలో చేపట్టిన భవన నిర్మాణాలను
క్షేత్ర స్థాయి తనిఖీలు నిర్వహించారు. అంతేకాకుండా దేశాయ్ పేట్ లోని రెండు పడకల గృహ సముదాయాన్ని కమిషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో సి ఎం హెచ్ ఓ డాక్టర్ రాజారెడ్డి, ఏం హెచ్ ఓ డాక్టర్ రాజేష్, ఐ టి మేనేజర్ రమేష్ ఐసిసిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







