TG: సినీ కార్మికుల ఆందోళనపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. కార్మికులకు వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ఢిల్లీ పర్యటన అనంతరం సినీ కార్మికులతో ప్రత్యేకంగా భేటీ అవుతానని చెప్పారు. ప్రస్తుతం సినీ కార్మికుల ఆందోళనపై దిల్ రాజు చర్చిస్తున్నారని తెలిపారు. ప్రతీ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తున్నామని.. కార్మికుల డిమాండ్లపై నిర్మాతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు.
Post Views: 117








