భూపాలపల్లి, మహా :
భారత రాజ్యాంగంలో పొందుపర్చబడిన గిరిజన హాకులు ఏమున్నాయి అనేది తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలని న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి ఏ. నాగరాజ్ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గురువారం సమావేశం నిర్వహించారు. గిరిజన హక్కుల పరిరక్షణ, హక్కుల వినియోగం అనే అంశం మీద గౌరవనీయులు జడ్జి ఏ నాగరాజు ప్రసంగించారు. విద్యార్థులు హేతుబద్దమైన ప్రశ్నలు వేయడం అలవాటు చేసుకోవాలన్నారు. ప్రశ్నించడం మర్చిపోయిన వ్యక్తి తన ఉనికిని కోల్పోతాడని అన్నారు. విద్యార్థులు పోషక ఆహారాన్ని భుజించాలని, ఆరోగ్యంగా వున్నప్పుడే చదువుకోవడం సాధ్యమవుతుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జిఎస్.ఆర్. దిలీప్ కుమార్ నాయక్, గవర్నమెంట్ ప్లీడర్ బొట్ల సుధాకర్, అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు వి. శ్రీనివాస చారి , ప్రధాన కార్యదర్శి వి. శ్రావణ్ రావు, పాఠశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ సమ్మయ్య నాయక్ , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్స్ కంప అక్షయ , జి.ప్రియాంక , సీనియర్ న్యాయవాదులు పగడాల ఆనందరావు , మొయినుద్దీన్, సంధ్య పాల్గొన్నారు.







