Mahaa Daily Exclusive

  వేంకటేశ్వర్ రావు ఉపాధ్యాయున్నీ విధుల నుంచి తొలగించాలి. తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్..!

Share

కాటారం, మహా :

భూపాలపల్లి జిల్లా మలహర్ మండలంలోని పెద్దతుండ్ల పాఠశాలలోఇంగ్లీష్ టీచర్ పిన్నింటి వేంకటేశ్వర్ రావు ను వెంటనే సస్పెండ్ చేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్ చేశారు. గురువారం తాడిచర్లలో మీడయాతో మాట్లాడారు. గత మూడేళ్ళుగా పాఠశాలకు రాకుండా ప్రయివేటు వ్యాపారాలు చూసుకుంటూ,ప్రభుత్వ సెలవుల్లో మాత్రమే వేతనం పొందుతున్న అతన్ని వెంటనే విధుల్లో నుంచి తొలగించి,అతనికి కొమ్ము కాస్తున్న జిల్లా డిఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్,గురువారం ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం చేపట్టిన మ్యాచువల్ ట్రాన్స్ పర్ లో భాగంగా 21, జూన్,2022లో జాయిన్ అయిన వేంకటేశ్వర్ రావు 2024 జూన్ 12 వరకు దాదాపు 28 నెలలుగా లాంగ్ లివ్ పెడుతూ,ఆయన స్థానంలో వేరే ఉపాధ్యాయులను జాయిన్ కాకుండా వేకెన్సీ ఇవ్వకుండా చదువుల్లో విద్యార్థులకు నష్టం చేసిన, ఇతగాడి చరిత్రను స్థానిక ప్రధానోపాధ్యాయుడు, ఎంఈఓ లకు జిల్లా డిఈఓ కు పంపిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఉపాధ్యాయ వృత్తికి మచ్చ తెచ్చే ఇతనివద్ద నుంచి జిల్లా విద్యాధికారి మామూళ్లు తీసికొని చూసిచూడనట్లుగా చేయడం సరికాదన్నారు.అటు ప్రయివేటు వ్యాపారాలు చేసుకుంటూ, ఇటు ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తూ వస్తున్న ఇతనికి జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు వతాస్తు పలకడంపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మంత్రి ఇలాకాలో ఇలాంటి ఉపాధ్యాయులు ఉండడం,అదికూడా మూడేళ్ళుగా విద్యాశాఖ నిద్రమత్తులో జోగడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యుఐఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్. ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక కో కన్వీనర్ అయితే బాపు. తుడుం దెబ్బ జిల్లా నాయకుడు దయ్యం పోచయ్య తదితరులు పాల్గొన్నారు