కాటారం, మహా :
దక్షిణాది రాష్ట్రాల్లో ఉపాధి హామీ పథకాన్ని నేరుగార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వివక్ష కనబరుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ ఆరోపించారు. గురువారం కాటారంలో సోషల్ ఆడిట్ ప్రజా వేదిక కార్యక్రమంలో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం లో ఉన్నప్పుడు చట్టబద్ధత కల్పించి కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించిందన్నారు బిజెపి ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేయకుండా నిధులను తగ్గిస్తూ నిబంధనలను ఎక్కువగా అమలు చేస్తోందని విమర్శించారు.ఏడాదికాలంగా కొత్త జాబ్ కార్డులు ఇవ్వడం లేదని కుటుంబంలో మాత్రమే 100 పని దినాలు కల్పిస్తూ ఫ్రీజింగ్ పెట్టారని అన్నారు. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉన్నా కేవలం 100 పని దినాలకే పరిమితి చేస్తుండడంతో పనిచేసే వారికి నష్టం కలుగుతుందన్నారు.పనిదినాలపై ఫ్రీజింగ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పనికి రాని కూలీలకు అవగాహన కల్పించి ఉపాధి కలిగించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ సిబ్బందికి ఎలాంటి సమస్యలున్న అంధానకాతగా పరిష్కరించేందుకు కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ సిబ్బంది వినతి
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ కు విజ్ఞప్తి చేశారు. గురువారం కాటారం ఎంపీపీ కార్యాలయంలో రమేష్ ను శాలువాతో సన్మానం చేశారు. క్షేత్రస్థాయిలో పడుతున్న ఇబ్బందులు,సమస్యల పై వినతి పత్రాలు ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కౌన్సిల్ సభ్యులు దండు రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాతారం మండలం లో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.








