కాటారం, మహా :
హైదరాబాద్ లో జరిగే వికలాంగుల సింహగర్జన సభను విజయవంతం చేయాలని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు మంతెన చిరంజీవి మాదిగ అన్నారు. గురువారం కాటారం మండలంలోని గంగారం గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జ్ దుమ్మ వెంకటేశ్వర మాదిగ పాల్గొన్నారు.రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా ఆసరా పెన్షన్ లు, గీత కార్మికులకు,బీడీ కార్మికులకు, వికలాంగులకు పెంచుతానన్న పింఛన్ల హామీ నెరవేర్చలేదని ఆరోపించారు.పెన్షన్ లు పెంచకుండా పింఛన్దారుల పట్ల ప్రదర్శిస్తున్న వివక్షను వెంటనే విడనాడి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేయూత పెన్షన్లను అన్నింటినీ పెంచాలని, ముఖ్యంగా వికలాంగులకు రూ 6000, తీవ్రవైకల్యం కలిగిన వికలాంగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిరిగానే 15 వేల రూపాయల పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికలాంగులకు సంబంధించి ప్రధానమైన 25 డిమాండ్లను కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలనే అంశాలను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.ఆగస్టు 13 న హైదరాబాద్ కేంద్రంగా జరిగే వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహా గర్జన సదస్సును మండలంలో ఉన్న వికలాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల భూపాల్ పల్లి జిల్లా అధ్యక్షులు దుర్గం శంకరన్న, గంగారం గ్రామ కమిటీ వికలాంగుల అధ్యక్షులు మంతెన రాజశేఖర్, సత్యం, లావణ్య, సతీష్, కొలువురు సంతోష్, సమ్మక్క పాల్గొన్నారు.








