Mahaa Daily Exclusive

  సుంకిడి వాగులో ఒకరి దుర్మరణం…..!

Share

తలమడుగు మహా:
వాగులో ఒక వ్యక్తి శవం తేలిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామానికి చెందిన దాసరి ప్రశాంత్(50) తన తాత యొక్క భూమి తన తండ్రి దాసరి ఎర్రన్న పేరుపై చేయకుండా, దాసరి లింగన్న రిజిస్ట్రేషన్ చేసుకోగా గత సంవత్సరం నుంచి ఎక్కువ మద్యానికి బానిసై ప్రతిరోజు ఇంట్లో మనభూమి మనం చేసుకోవాలని గొడవ పడుతూ ఉండేవారు. బుధవారం కూడా ప్రొద్దున 10 గంటలకు గొడవ పడి వెళ్ళిన ప్రశాంత్ అర్ధరాత్రి అయినా రాకపోవడంతో కుటుంబీకులు చుట్టుపక్కలంతా వెతికిన ఆచూకీ దొరకలేదు. గురువారం ఉదయం 8 గంటలకు సుంకిడి వాగులో ఓశవం తేలి ఉండటంతో ఆ శవాన్ని బయటకు తియ్యగా దాసరి ప్రశాంత్ అని తన తండ్రి దాసరి ఎర్రన్న నిర్ధారించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాధిక వెల్లడించారు. మృతుడికి భార్య ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.