Mahaa Daily Exclusive

  బెల్లంపల్లి సబ్-కలెక్టర్ గా మనోజ్ ..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల
జిల్లా బెల్లంపల్లి సబ్-కలెక్టర్ గా ఐ.ఈ.ఎస్.ఎస్.డి. మనోజ్ (ఐ.ఎ.ఎస్) గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తన ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సబ్-కలెక్టర్ బెల్లంపల్లి మండలం, కన్నాల పంచాయతీ, బుగ్గ రాజేశ్వరుడి దేవాలయంలో కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి తాసిల్దార్ కృష్ణ, ఆలయ అర్చకులు శ్రీరాంభట్ల వేణుగోపాల శాస్త్రి, సతీష్ శర్మ, బుగ్గ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాసాడి శ్రీదేవి శ్రీరాములు, కన్నాల మాజీ సర్పంచ్ జిల్లపల్లి స్వరూప, ట్రస్ట్ సభ్యులు వెంకటస్వామి, మురుకూరి బాలకృష్ణ, భావన్లపల్లి భరత్ పాల్గొన్నారు.