కూసుమంచి, ఆగస్టు 7, మహా:
కూసుమంచి మండలంలోని జీళ్ళచెరువు పంచాయతీ గోపాలరావుపేట నుంచి కూసుమంచి వరకు ప్రధాన రహదారి వెంట 1000 పైగా మొక్కలను నాటేందుకు ప్లాన్ చేస్తున్నామని కూసుమంచి ఎంపీడీవో రామచంద్రరావు తెలిపారు. గురువారం జీళ్ళచెరువు గ్రామంలో ప్లాంటేషన్ కోసం మొక్కలను నాటేందుకు ఈజీఎస్ కూలీలు గుంతలను తీస్తుండగా ఎంపీడీవో రామచంద్రరావు, ఈసీ కరుణ, ఏపీఓ అప్పారావు, కార్యదర్శి రాజేష్, టీఏ నరేష్ పరిశీలించారు. కూలీలతోఋ మాట్లాడారు. సిస్టమాటిక్ గా గుంతలు తీయాలని సూచించారు. ప్రతి గుంతకు మొక్కను ఏర్పటు చేయాలని, 1000 మొక్కలను పరిష్కరించాలని కోరారు. అతి త్వరలో రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు సహాకరించాలని కోరారు.
Post Views: 80







