కూసుమంచి,మహా:
కూసుమంచి మండలం పాలేరు సాగర్ ఎడమ కాలువ వద్ద రూ .14 కోట్లతో నిర్మిస్తున్న య్యూటీ (అండర్ టన్నెల్) పనులను గురువారం ఇరిగేషన్ శాఖ సీఈ,ఎస్ఈ మంగళపూడి వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన పనులను గుత్తేదారు గోపాలరావు మూడు షీప్ట్లో పగలు, రాత్రి తేడా లేకుండా పనులను నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేశారని మిగిలిన చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 61







