కూసుమంచి, ఆగస్టు 7, మహా:
కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామంలోని బీసీ కాలనీలో గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో వైభవంగా ముత్యాలమ్మ పండుగ జరిగింది. భక్తులందరూ జలబిందేలతో ముత్యాలమ్మ అమ్మవారికి జలాభిషేకంతో పాటు పాలు, పెరుగు, నెయ్యి,తేనే, కొబ్బరి, చెక్కర లాంటి 21 రకాల ఐటేమ్స్ తో ప్రత్యేకంగా అభిషేకం చేశారు. అనంతరం బోనాలతో గ్రామంలో ప్రదర్శనగా ముత్యాలమ్మ దేవాలయంకు చేరుకుని అమ్మవారికి బోనాలను సమర్పించారు. పెండ్ర అంజయ్య, ఎల్లమ్మ దంపతులు పట్టువస్త్రాలను అమ్మవారికి అందజేశారు. ఈ సందర్భంగా అంజయ్య మాట్లాడుతూ గ్రామ ప్రజలందర్ని ముత్యాలమ్మ అమ్మవారు చల్లగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని ఆ ముత్యాలమ్మ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో పెండ్ర ప్రసాద్, ఎర్రయ్య, వెంకన్న, వీరబాబు, హారీష్, రమేష్, ఉపేందర్, వెంకటేశ్వర్లు, నరేష్, చంటీ, రిక్కి, తరుణ్, గురువులు తదితరులు పాల్గొన్నారు.








