Mahaa Daily Exclusive

  గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందించి చట్ట బద్ధంగా రక్షణ కల్పించాలి : సి.పి.యం.పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ..!

Share

ఆగస్టు, 7 (మహా )
ఖమ్మం రూరల్ మండలం మారెమ్మగుడి వద్ద ఉన్న దుశ్యంత్ రెడ్డి ఫంక్షన్ హాలు నందు గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జనరల్ బాడీ సమావేశము నిర్వహించారు . ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం జిల్లా సి.పి.యం. పార్టీ కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు , ఖమ్మం నగర బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షులు , జిల్లా నాయకులు పగడాల నాగరాజు , స్పర్శ సామాజిక అధ్యయన వేదిక అధ్యక్షులు & తెలంగాణ ఉద్యమనేత కాకి భాస్కర్ , ప్రముఖ సీనియర్ అడ్వకేట్ , తెలంగాణ ఉద్యమనేత మేకల సుగుణారావు , ఐ.యన్.టి.యు.సి. వర్కింగ్ ప్రసిడెంట్ యం.డి. వై. పాషా లు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యో నారాయణ అంటూ గ్రామీణ వైద్యులు పేదలకు సేవలు అందిస్తూ వారి మనలను పొందుతూ వస్తుంటే గ్రామీణ వైద్యులపై టి.జి.యం.సి దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . ఎవరో ఒకరు ఇద్దరు చేసిన తప్పులకు గ్రామీణ వైద్యులు అందరూ ఆ నిందను మోస్తున్నారని దీనిపై దృష్టి చారించి సమగ్ర విచారణ జరిపించి అసలైన నికాసైనా గ్రామీణ వైద్యులకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు . నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాటుపడుతున్న గ్రామీణ వైద్యులపై టీజీఎంసీ చేస్తున్న దాడులను ఖండించాలని గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు , రాష్ట్ర ఉపాధ్యక్షులు పిట్టల నాగేశ్వరరావు , కార్యనిర్వహణ సభ్యుడు అనంతారపు వెంకటాచారి లు పిలుపునిచ్చారు . వైద్యాన్ని ప్రజల దగ్గరకు తీసుకువెళ్లి , ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు, సూచనలు చేసి ఫస్ట్ ఎయిడ్ పరీక్షలు నిర్వహించి వారికి వెన్నుదన్నుగా , అండగా ఉంటున్న గ్రామీణ వైద్యులు నేడు సమాజానికి ఎంతో అవసరం అన్నారు . అందుకే దేశంలో అన్ని ఉద్యమాలు వచ్చాయి కానీ వైద్య ఉద్యమం రాకపోవడానికి కారణం గ్రామీణ వైద్యులే . ఉమ్మడి జిల్లా నుండి వచ్చిన గ్రామీణ వైద్యులకు సీజనల్ వ్యాధులపై ప్రత్యేక అవగాహనను తెలియజేశారు . గ్రామీణ వైద్యులకు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో 429 , 428 , 1273 లను పునరుద్ధరించాలని , గ్రామీణ వైద్యులకు పారామెడికల్ శిక్షణను ఇప్పించి చట్టబద్ధత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు . అదేవిధంగా గ్రామీణ వైద్యులపై టిజిఎంసి దాడులను ఖండిస్తూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు . ఈ సమావేశంలో ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ మణికుమార్ , ఎన్ సుదర్శన్ , జి వెంకటరామయ్య , కార్యదర్శి ఇంటూరి నాగరాజు , ప్రచార కార్యదర్శి బి కృష్ణమూర్తి , సహాయ కార్యదర్శులు చంద్రారెడ్డి , టి రాము , కె. రాములు , యల్. శ్రీనివాసరావు , జి. వెంకటేశ్వర్లు , దాసరి శ్రీనివాసరావు , షేక్ హుస్సేన్ మియా , రాయల శ్రీనివాసరావు , ఎండి మహమ్మద్ , సత్యం తదితరులు పాల్గొన్నారు .