రఘునాథపాలెం, మహా.
రఘునాథపాలెం మండలం పాపటపల్లి వద్ద బుగ్గ వాగు వంతెన మీదుగా భారీగా నీరు ప్రవహిస్తోంది. ఇల్లందు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో కురిసిన ఉరుములు-మెరుపులతో కూడిన వర్షానికి వాగు ఉప్పొంగింది.
వంతెనపై మూడు అడుగుల మేర నీరు ప్రవహించడంతో ఖమ్మం – డోర్నకల్ మధ్య రహదారి తాత్కాలికంగా మూసివేయబడింది. ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్రమత్తమైన రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని సమీక్షించారు.
ప్రజలు అత్యవసరమైన పనులకై ప్రయాణం మినహా, వాగు తీరాలకు రాకపోకలు నివారించాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షపాతం కొనసాగినంత కాలం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Post Views: 37








