Mahaa Daily Exclusive

  కేటీఆర్‌ను కలిసిన గౌసుద్దీన్‌..!

Share

కారేపల్లి, మహా : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట తారకరామారావు(కేటీఆర్‌)ను బీఆర్‌ఎస్‌ మైనారిటీ జిల్లానాయకులు కారేపల్లికి చెందిన షేక్‌ గౌసుద్దీన్‌ కలిశారు. గురువారం హైదారాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసిన గౌసుద్దీన్‌ జిల్లాలో పార్టీ పరిస్థితి, మైనారిటీల సంక్షేమంపై ప్రభుత్వ వివక్షతను వివరించారు. బీఆర్‌ఎస్‌ పటిష్టంగా ఉందని కార్యకర్తలను ఉత్సహ పరిచే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. దీనిపై కేటీఆర్‌ స్పందించి గౌసుద్దీన్‌ అభినందించారు. ఈసందర్బంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల ఇంజనీరింగ్‌ నభ్యసిస్తున్న గౌసుద్దీన్‌ కుమార్తె షేక్‌ మదీనా కౌసర్‌ ను కేటీఆర్‌ అభినందించి కళాశాలలో మెస్‌ చార్జీలు చెల్లిస్తానని హామీ ఇచ్చి ల్యాఫ్‌ట్యాఫ్‌ను అందజేశారు. కేటీఆర్‌ దాతృత్వానికి గౌసుద్దీన్‌ కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో మైనార్టీ నాయకులు ఖలీలుల్లాఖాన్‌ తదితరులు ఉన్నారు.