నేలకొండపల్లి, ఆగస్టు 10 మహా:
సిపిఐ(ఎం) సీనియర్ నాయకులు అమరజీవి నూతక్కి గంగాధరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సిపిఐ(ఎం) కార్యాలయంలో జరిగిన 32వ నెల నెలా ఉచిత వైద్య శిబిరం విజయవంతమైంది. ఈ వైద్య శిబిరంలో 102మంది రోగులకు డాక్టర్లు వైద్య సేవలు అందించారు. వైద్య శిబిరంలో షుగర్, బీపీతో పాటు ఇతర సాధారణ జబ్బులకు డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించారు. శరత్ మాక్సివిజన్ ఖమ్మం వారిచే 26 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. బీపీ షుగర్ వ్యాధులకు నెలకు సరిపడా మందులను కేవలం 100 రూపాయలకే అందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఏటుకూరి రామారావు మాట్లాడుతూ వైద్య శిబిరానికి ప్రతి నెల ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు. సిపిఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై పోరాటాలకే పరిమితం కాకుండా సేవా కార్యక్రమాలను కూడా మరింత విస్తృతంగా చేపట్టాలనే లక్ష్యంతో ప్రతి నెల వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైద్య సేవలు అందించిన డాక్టర్ యలమద్ది వినూష ఎంబీబీఎస్ ఎండి, డీఎం (న్యూరో ఫిజీషియన్ ), డాక్టర్ గుడిపూడి రాజేష్ ఎంబిబిఎస్, డిఎన్ బీ (చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు), డాక్టర్ అడపా జయశ్రీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ (నేత్ర వైద్య నిపుణులు ), వాలంటీర్లకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీపీ చెక్ చేసి మాత్రలు వేసుకునే విధానంలో సేవలందించిన గ్రామీణ వైద్యులు బండారుపల్లి నాగేశ్వరరావు, బండి పుష్పలత, ఎన్జీఆర్ ఫౌండేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి మాటూరి శేషగిరిరావు కీర్తిశేషులు సుగుణ దంపతుల కుమారుడు సుబ్రహ్మణ్యం అల్పాహార వితరణ చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్జీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి కే వీ రామిరెడ్డి, కోశాధికారి గుడవర్తి నాగేశ్వరరావు,
మంకెనపల్లి నరసింహారావు, వల్లంచెట్ల భాస్కరరావు, ఏలూరి కోదండ రామారావు, దండా సైదారావు, షేక్ అబ్దుల్ నబీ, అబ్దుల్ రహీం, సామాల మల్లికార్జున్, డి నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.







