Mahaa Daily Exclusive

  ఘనంగా ముత్యాలమ్మ తల్లి కి బోనాలు ..!

Share

కారేపల్లి, మహా: కారేపల్లి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామంలో ఆదివారం గ్రామస్తులు ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించుకున్నారు. గ్రామంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ముందుగా బొడ్రాయి (నా బీశిల) వద్దా పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ప్రదర్శనగా ముత్యాలమ్మ తల్లి ఆలయ వద్దకు చేరుకొని ముత్యాలమ్మ తల్లి కి బోనాలు తో నైవేద్యం సమర్పించారు. అనంతరం అమ్మవారికి మొక్కిన మొక్కులను చెల్లిస్తూ మేకపోతులు, కోళ్లు కోసి తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, తోపాటు మరి కొంత మంది గ్రామస్తులు పెద్ద సంఖ్య పాల్గొన్నారు