Mahaa Daily Exclusive

  సింగరేణి గృహ సముదాయాల్లో వరుస చోరీలు…!

Share

సత్తుపల్లి, ఆగస్టు 10: మహా.

సత్తుపల్లి సింగరేణి కార్మికులు నివసించడానికి ఏర్పాటు చేసిన పి.వి నరసింహారావు గృహసమదాయాల్లో ఆరు నివాసాలలో శనివారం రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు.1)ఎం.సీ-6 బ్లాక్ 62వ గదికి చెందిన అఖిల్ (అండర్ మేనేజర్) నివాసంలో 1/2 కేజీ వెండి, 7000 రూపాయలు నగదు.
2) ఎం.సి- 6 బ్లాక్ 65వ గదికి చెందిన శీలం.రాజు (ఫోర్ మెన్) నివాసంలో 18 వేల రూపాయల నగదు. 3)ఎం.సి-4 బ్లాక్ 48వ గదికి చెందిన అశోక్ (ఫోర్ మెన్) నివాసంలో 4 తులాల బంగారం, 50 తులాల వెండి, 20 వేల రూపాయల నగదు. 4)ఎం.డి -20 బ్లాక్ 277 వ గదికి చెందిన ఎండి సాదిక్ (పంప్ ఆపరేటర్) నివాసంలో బంగారు బ్రాస్లెట్,3 తులాల పట్టీలు, 6 తులాల వెండి.5) ఎం.డి-20 బ్లాక్ 275 వ గదికి చెందిన కె.సుధాకర్ (జనరల్ మజ్దూర్) నివాసంలో 4 తులాల బంగారం, 20 తులాల వెండి, 30 వేల రూపాయల నగదు. 5)ఎం.డి-19 బ్లాక్ 258వ గదికి చెందిన నరసింహారావు (ఈ.పీ ఆపరేటర్) నివాసంలో 1 తులం బంగారం, 2తులాల వెండి దొంగతనం జరిగినట్టు బాధితులు తెలిపారు.తక్కువ సమయంలోనే వరుసగా మూడవ చోరీ కావడంతో సింగరేణి కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధితుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న సత్తుపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ టి.శ్రీహరి తన సిబ్బందితో కలిసి సీసీ కెమెరా దృశ్యాలు, నేరగాళ్ళ వేళ్ళ ముద్రలు సేకరించి క్లూస్ టీం సకారంతో కేసు దర్యాప్తు ప్రారంభించారు.